Jump to Content

మరింత వేగవంతం, మరింత సురక్షితం, మరింత సులభతరం. ఒక్క ట్యాప్‌తోనే, Googleతో సైన్ ఇన్ చేయండి.

సైన్ అప్ చేయడం, సైన్ ఇన్ చేయడాన్ని మరింత సురక్షితంగా, మరింత సులభతరంగా చేయడానికి మీ Google ఖాతాను ఉపయోగించండి, తద్వారా మీరు యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లపై తక్కువ సమయం ఖర్చు చేసి, మీకు ఇష్టమైన యాప్‌లలో, సైట్‌లలో ఎక్కువ సమయం గడపవచ్చు.

ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై 'Googleతో సైన్ ఇన్' అనే బటన్‌పై మౌస్ కర్సర్ హోవర్ అవుతోంది (కదులుతోంది). యాప్ ఐకాన్‌లు స్క్రీన్ అంతా తిరుగుతున్నాయి. ల్యాప్‌టాప్ పక్కన, ఒక మొబైల్ పరికరం కూడా 'Googleతో సైన్ ఇన్' బటన్‌ను డిస్‌ప్లే చేస్తోంది.
  • నిరంతరాయంగా సైన్ ఇన్ చేయండి

    యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌ల తిప్పలు లేకుండా, సులభంగా, సురక్షితంగా కొత్త ఖాతాలను క్రియేట్ చేయండి లేదా మీ ఇష్టమైన యాప్‌లలో, సైట్‌లలో సైన్ ఇన్ చేయండి.

  • ఏ పరికరాన్ని అయినా ఉపయోగించండి

    iOS ఇంకా Androidతో సహా, మీరు ఉపయోగించే అన్ని బ్రౌజర్‌లలో, పరికరాలలో సులభమైన, మరింత సౌకర్యవంతమైన సైన్-ఇన్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆస్వాదించండి.

  • మీ కనెక్షన్‌లను కంట్రోల్ చేయండి

    మీ పేరు, ఈమెయిల్ అడ్రస్ ఇంకా ప్రొఫైల్ ఫోటో వంటి ఖాతా సమాచారాన్ని సురక్షితంగా షేర్ చేయడం ద్వారా, అలాగే Drive వంటి Google యాప్‌లకు యాక్సెస్‌ను మేనేజ్ చేయడం ద్వారా మీ యాప్‌లు, సైట్‌లకు సంబంధించి కంట్రోల్‌ను కలిగి ఉండండి.

  • Googleతో మెరుగైన భద్రతతో ఉండండి

    వేరే చోట వాడిన పాస్‌వర్డ్‌లకు, బలహీనమైన సైన్ ఇన్‌లకు గుడ్‌బై చెప్పండి. మీ Google ఖాతాను సురక్షితంగా సైన్ ఇన్ చేయడానికి ఉపయోగించడం అంటే, మీ పాస్‌వర్డ్‌లను స్టోర్ చేయడానికి తక్కువ యాప్‌లు, సైట్‌లపై ఆధారపడటం, కాబట్టి మీ డేటా సురక్షితంగా ఉంటుంది.

'Googleతో సైన్ ఇన్'‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి

మీ Google ఖాతాతో ఏ పరికరంలోనైనా మీకు ఇష్టమైన యాప్‌లను, సైట్‌లను సులభంగా యాక్సెస్ చేయండి

యాప్ లేదా సైట్‌లో 'Googleతో సైన్ ఇన్' బటన్‌ను క్లిక్ చేయండి

ఉపయోగించడానికి ఒక Google ఖాతాను ఎంచుకోండి

ఇది మీ మొదటి సారి అయితే, యాప్ లేదా సర్వీస్‌కు సైన్ ఇన్ చేయడానికి మీ Google ఖాతా నుండి పేరును, ఈమెయిల్ అడ్రస్‌ను ఇంకా ప్రొఫైల్ ఫోటోను షేర్ చేయండి
కొన్ని యాప్‌లు మీ అడ్రస్ లేదా ఫోన్ నంబర్ వంటి ఇతర సమాచారాన్ని అడగవచ్చు, దీన్ని మీరు ఎప్పుడైనా మీ Google ఖాతా సెట్టింగ్‌లలో కంట్రోల్ చేయవచ్చు.

యాప్‌నకు లేదా సైట్‌కు కొనసాగండి

అంతే, ఇప్పుడు మీరు సైన్ ఇన్ అయ్యారు!
ఇక తర్వాతి నుండి, మీ అదే Google ఖాతాను ఉపయోగించి సులభంగా తిరిగి సైన్ ఇన్ చేయండి.

ఒక పరికరం సైన్-ఇన్ స్క్రీన్‌ను చూపిస్తోంది. యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఫీల్డ్‌ల కింద, కొత్త ఖాతాను క్రియేట్ చేయడానికి లేదా Googleతో సైన్ ఇన్ చేయడానికి ఆప్షన్‌లు ఉన్నాయి. 'Googleతో సైన్ ఇన్' బటన్ విస్తరించి స్క్రీన్ నుండి పాప్ అవుతుంది. కర్సర్, బటన్‌పై క్లిక్ చేస్తుంది.
పరికర స్క్రీన్‌ను పాప్-అప్ నింపుతుంది. యాప్‌ను కొనసాగించడానికి లేదా మరొక ఖాతాను జోడించడానికి, Google ఖాతాను ఎంచుకోవాలని, అది యూజర్‌ను ప్రాంప్ట్ చేస్తుంది. ఉపయోగించేందుకు వీలుగా, కర్సర్ ఒక ఖాతాను ఎంచుకుంటుంది.
యాప్‌లో సైన్ ఇన్ చేయడానికి Googleను అనుమతించాలని యూజర్‌ను ప్రాంప్ట్ చేసేలా పాప్-అప్ మారుతుంది. కర్సర్, 'కొనసాగించండి' బటన్‌ను క్లిక్ చేస్తుంది. పాప్-అప్ క్లోజ్ అవుతుంది, స్క్రీన్, యాప్ లోడింగ్‌ను చూపిస్తుంది.

Google అందించే విశ్వసనీయమైన సెక్యూరిటీతో మరింత సురక్షితంగా సైన్ ఇన్ చేయండి

  • ఆటోమేటిక్‌గా సెక్యూరిటీ గల

    వేగవంతమైన, సురక్షితమైన సైన్-ఇన్ ప్రాసెస్‌కు మీరు అర్హులు. 'Googleతో సైన్ ఇన్' మీ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఎన్ని చోట్ల స్టోర్ చేయాలనే దానిని పరిమితం చేయడం ద్వారా థర్డ్ పార్టీ డేటా ఉల్లంఘనల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.

  • మీరే కంట్రోల్ చేయవచ్చు

    మీరు ప్రతి థర్డ్ పార్టీ యాప్‌తో, సైట్‌తో షేర్ చేయడానికి ఎంచుకున్న సమాచారాన్ని మేనేజ్ చేయండి, అలాగే మీ Google ఖాతా నుండి ఏ సమయంలోనైనా మీ సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయండి.

  • డిజైన్ ద్వారా గోప్యంగా ఉన్నది

    యాడ్‌లు లేదా ఏదైనా ఇతర Google ప్రోడక్ట్‌ల కోసం, 'Googleతో సైన్ ఇన్' ఫీచర్ నుండి ఏ సమాచారాన్ని లేదా యాక్టివిటీని గానీ Google ఉపయోగించదు. మీ గోప్యతను గౌరవించడానికి రూపొందించిన బాధ్యతాయుతమైన డేటా ప్రాక్టీసులను మేము ఖచ్చితంగా ఆచరిస్తాము.

కేవలం ఒక్క ట్యాప్‌తో మీకిష్టమైన యాప్‌లను, సైట్‌లను యాక్సెస్ చేయండి